‘షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది’

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మంత్రి బసవరాజు సారయ్య తెలియజేశారు. తెలంగాణకు కేంద్రం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వక తప్పదని చెప్పారు.