షిండే వ్యాఖ్యలపై పాల్వాయి అసంతృప్తి

 

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వయి గోవర్దన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్‌ చర్చలు సంతృప్తి కరంగా జరిగాయన్నారు. చర్చలు స్నేహ పూర్వకంగా జరిగాయని ద్వివేది, ఫెర్నాండేజ్‌లు స్వయంగా వ్యాఖ్యానించిన విషయాన్ని షిండే తెలుసుకోవాలన్నారు. ఈ నెల 18న షిండేను కలుస్తానన్నారు.