సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నాం : పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌

ఢిల్లీ: ముంబయి దాడుల కేసులో సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నామని, త్రీవవాదం పై పోరులో భారత్‌కు సహకరిస్తామని పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌ అన్నారు. ఈ రోజు జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు.  జలీల్‌ అబ్బాస్‌ మాట్లాడుతూ విశ్వాస కల్పన చర్యలు, శాంతిబద్రతలపై భారత్‌  విదేశాంగ కార్యదర్శి రంజన్‌ మదాయ్‌తో చర్చించామని అన్నారు. భారత్‌, పాక్‌ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకోచ్చేందుకు అంగీకరించామని రంజన్‌ మధాయ్‌ తెలియజేశారు. జలీల్‌ అబ్బాస్‌తో నిర్మాణాత్మక చర్చలు జరగాయని వెల్లడించారు.