సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌: సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాక్‌ ముందు ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసుల అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు మొదట విద్యుత్‌సౌథ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించినా చివరి నిమిషంలో తమ వేదికను సచివాలయంకు మార్చి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.