సచివాలయంలో సీఎం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త

హైదరాబాద్‌: తెదేపా ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మధ్యలో వెళ్లిపోయిన ముఖ్యమంత్రి రెండోసారి వారితో మాట్లాడి వెళ్లారు. అయినా ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయారని తెదేపా బృందం ఆరోపించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాసిబ్బంది తెదేపా నేతలను బలవంతంగా కిందకు తీసుకువచ్చే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.