సత్యం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌: సత్యం రామలింగరాజు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిటీ సివిల్‌ కోర్టు అనుమతి ఇచ్చింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో సత్యం రామలింగరాజుకు చెందిన 29 చోట్ల ఉన్న 120 కోట్ల ఆస్తులను ఆటాచ్‌మెంట్‌ చేయడానికి సీబీఐకి అనుమతి ఇచ్చింది.