సత్యం రామలింగరాజు శిక్ష ఖరారు..

హైదరాబాద్ : సత్యం రామలింగరాజుకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రామలింగరాజుతో సహా పది మంది దోషులకు నాంపల్లి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజు..రామరాజులకు చెరో ఐదు కోట్ల జరిమాన విధించింది. మిగిలిన ఎనిమిది మందికి లక్ష రూపాయల చొప్పున జరిమాన విధించింది.