సత్యనారాయణకు పదోన్నతి

ఏలూరు, జూన్‌ 27: పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా పనిచేస్తున్న కె.సత్యనారాయణకు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సిపివో హోదాలో జిల్లా స్థాయి అధికారిగా ఉన్న ఆయనకు జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలోనే నియమించింది. సత్యనారాయణకు పదోన్నతి లభించడం పట్ల జిల్లా రెవెన్యూ అధికారి ఎం.మోహనరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై.రామకృష్ణ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆర్‌విఎస్‌ రామచంద్ర రావు, ఏలూరు డివిజనల్‌ రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు, తదితరులు అభినందనలు తెలిపారు.