సమస్యలకు తక్షణ పరిష్కారం : తహశీల్దార్‌ పద్మయ్య

రామగుండం, జూన్‌ 11, (జనంసాక్షి):

రామగుండం మండలం తహాశీల్దార్‌ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహాశీ ల్దార్‌ బైరం పద్మయ్య 28ఫిర్యాదులను స్వీకరించారు. రేషన్‌కా ర్డులకు సంబంధించి 14, ఇళ్ళకు సంబంధించి 1, పెన్షన్‌కు సంబంధించి 1, రెవెన్యూకు సంబంధించి 6, ఇతర సమస్యలకు సంబంధించి 4దరఖాస్తులు వచ్చాయి. తహాశీల్దార్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను పరిశీలించి, సమస్య సాద óనకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ యాదగిరి, ఎంఈఓ మోహ న్‌, ఏఈ రాజనర్సయ్య, వ్యవసాయాధికారిణి వినీల, కార్యదర్శి గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.