సమస్యలపై వెంటనే స్పందించిన కార్పొరేటర్ సబిహా
ఆగస్టు 25 (జనంసాక్షి )
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ ఆంధ్ర బ్యాంకు లైన్లో ఈరోజు గురువారం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ స్థానికుల పిరియాదుమెరకు పరివేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు మా దృష్టికి తెచ్చినటువంటి సమస్యలు స్ట్రాంమ్ వాటర్, మరియు సెవరేజ్ ఓవర్ ఫ్లో కావడం వల్ల స్థానికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలియజేయడం వలన జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు ఈఈ సత్యనారాయణ, డి ఈ ఆనంద్, ఏఈ రంజిత్, జనమండలి అధికారులు మూర్తి, మొగులయ్య, తో కలిసి పర్యవేక్షించారు అని, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరారెడ్డి, జ్ఞానేశ్వర్, కాశీనాథ్ చారి, టీవీఎస్ రాజు, మల్లికార్జున్, ఇస్మాయిల్, యోగి రాజు, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు