సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్‌ ఫ్రీ నెంబరును ప్రారంభించింది. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మెరుగైన వ్యవసాయం కోసం సలహాలు కావాలన్నా 1800రైతుల ఫిర్యాదుపై అధికారులు 24గంటల్లో స్పందించి చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.