సమాజాన్ని మార్చగలిగే శక్తి గురువులకే ఉంది

హైదరాబాద్‌: భావిభారత్‌ పౌరుల వ్యక్తిత్వం తరగతి గదుల్లోనేదని విద్యార్థులు సరైన తీరులో శిక్షణ పొందితే మంచి సమాజం రూపొందుతుందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారిధి అన్నారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి గురువులకే ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ట్యాంక్‌బండ్‌ వద్ద డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాధాకృష్ణన్‌ ఆ నాడూ ఈనాడూ కూడా  ఉపాధ్యాయలందరికీ ఆదర్శనీయులని అన్నారు.