సమావేశం ఏర్పాటుచేస్తే దీక్ష విరమిస్తా: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మానుకొని విద్యుత్‌ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీక్ష విరమిస్తానని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి  దయాకరరావు స్పష్టంచేశారు. దీక్ష విరమించమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ఫోన్‌ చేయగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి కోరారు. క్యాంపు కార్యాలయం ముట్టడి సందర్భంగా ఎర్రబెల్లిని పోలీసులు గృహ నిర్బంధంలో వుంచారు.