సమితి గుడ్‌విల్ అంబాసడర్‌గా ఐశ్వర్యారాయ్
న్యూయార్క్ ప్రముఖ బాలీవుడ్ నటి,ఒకనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబసాడర్‌గా నియమితులయ్యారు. ఈ హోదాలో యూఎన్ ఎయిడ్స్ తరపున ఐశ్వర్య పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా ఐశ్వర్య పెర్కోన్నారు. ఈ హోదాలో తాను నామమాత్రంగా కాక, ఎయి స్యపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పోగోట్టడంలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఐశ్వర్య చెప్పారు. పసి పిల్లలకు హెచ్‌ఐవీ సోకకుండా, ఈ వైరస్‌తో భాధపడుతున్నవారు క్రమం తప్పకుండా యాంటి రెట్రోవైరల్ మందులు వాడేలా… ప్రజల్లో చైతన్యం తిసుకోస్తానని అమే అన్నారు.