సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లంతు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాపాల తిప్ప నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు గల్లతైనట్లు సమాచారం. ఉదయం తెప్పలో వేటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదని బంధువులు ఆర్డీవోకు సమాచారం అందించారు. గల్లంతైన వారిలో ముగ్గురు విశాఖ జిల్లా నక్కపల్లి వాసులని సమాచారం.