*సరస్వతి దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..
జనం సాక్షి నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు ఆశ్లేష నక్షత్ర యుక్తంగా మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పి నవీన్ కుమార్ తెలిపారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ కమిటీ వారిచే ఉచితంగా నిర్వహించిన సామూహిక వ్రతాలలో 66 మంది మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించినట్లు తెలిపారు. వరలక్ష్మి వ్రత కథ విధానాన్ని వేద మంత్ర చరణాల మధ్య శాస్త్రవక్తంగా నిర్వహించారు. అమ్మవారిని శ్రావణమాసంలో కొలవడంతో విశేష ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వరలక్ష్మి వ్రత కథ విధానంలో సంపూర్తిగా భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సహా అర్చకులు ప్రవీణ్, వరలక్ష్మీ శ్రీ జ్ఞాన సరస్వతి బాల కళ్యాణ ఆశ్రమ అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, తదితర ప్రాంతాల భక్తులు, మహిళలు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.