సరిహద్దు లో పాక్ దాడులు – తిప్పి కొడుతున్న భారత్
జమ్మూకశ్మీర్ : భారత్ సైనిక స్థావరాలు, సరిహద్దు గ్రామాలను పాక్ బలగాలు టార్గెట్ చేశాయి. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. ఇవాళ ఉదయం 8 సైనిక స్థావరాలతో పాటు పలు గ్రామాలపై మోర్టార్ బాంబులతో పాక్ దాడి చేసింది. పాక్ దాడుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ బాంబు దాడుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొందరైతే తమ గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతోంది.