సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
గౌడ సోదరుల కోరిక మేరకు కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కొడకండ్ల, మార్చి12(జనం సాక్షి):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మంత్రి మీద అభిమానంతో గౌడ సోదరులు పోటీ పడి కల్లు పోశారు.కల్లు రుచి బాగుందని చెప్పి అభినందించిన మంత్రి.అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని,అతి చిన్న కుటుంబం లో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి,ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తని,నిజాం పాలన పై తిరుగుబాటు చేసి, బానిస పాలన పై యుద్ధం ప్రకటించారని, ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని,ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తని,అందుకే సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని, సీఎం కెసిఆర్ మనసున్న మహారాజని,హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం లో ఒక భవనం ఏర్పాటు చేస్తున్నారని,పాలకుర్తి నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాలు కట్టించానని,గిరక తాళ్ళు ఏర్పాటు చేయాలని,కల్లు బాగా వస్తుందని, రెండు ఏళ్ళ కింద నేను పాలకుర్తి నియోజకవర్గం లో గిరక తాళ్ళు పెట్టించానని,ఈ దిశగా గౌడ సోదరులు ఆలోచించాలని, అవసరమైన స్థలం కూడా కేటాయిస్తానని,సీఎం గౌడల కోసం ఎంతో చేస్తున్నారని ఆయన అన్నారు.వైన్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించిందని అన్నారు.కంఠ మహేశ్వర దేవుడి పేరున నియోజకవర్గం లో 20కి పైగా గుడులు కట్టిచ్చానని,కొడకండ్ల లో కమ్యూనిటీ హాలు అడుగుతున్నారని,కానీ మినీ ఫంక్షన్ హాలు నిర్మాణం చేస్తానని 20 లక్షల రూపాయలు అదనంగా ఇస్తానని అన్నారు.జనగామకు సర్వాయి పాపన్న పేరు ఆలోచిస్తున్నారని,కానీ జనగామలో ఎంతో మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళ పేర్లు పెట్టాలని కూడా డిమాండ్ లు వస్తున్నాయని
అన్నీ ఆలోచించి సీఎం కెసిఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని పాపన్న పేరు ఒక ప్రభుత్వ సంస్థకు తప్పకుండా పెట్టే విధంగా చూస్తానని,గౌడలు అన్ని రంగాల్లో ముందున్నారని,పాపన్న పేరు నిలిపే విధంగా గౌడల పనితీరు ఉందని
గౌడలకు అభినందనలు తెలిపారు.అనంతరం కొడకండ్ల నుండి జలాల్ పురం క్రాస్ వరకు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుకు మంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం మాట్లాడుతూ సర్వాయి పాపన్న చరిత్ర గొప్పదని,12 మందితో ప్రారంభించి 12 వేల మంది సైన్యాన్ని తయారు చేశాడని
పాపన్న చరిత్ర ప్రపంచానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఉందని
ప్రభుత్వం పాపన్న జయంతి, వర్ధంతి నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాపన్న విగ్రహాలు పెట్టిస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.
సర్వాయి పాపన్న సినిమా హీరో జైహింద్ గౌడ్ మాట్లాడుతూ
సర్వాయి పాపన్న పేరు మీద ప్రభుత్వం చేస్తున్నదని దానికి అభినందనీయమని,జనగామ జిల్లా కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని,
ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రముఖులు, విగ్రహ ప్రతిష్ఠాపన సంఘం బాధ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం రోజున మంత్రి పెళ్ళి రోజు కావడంతో కేకులు కట్ చేసి ఉత్సాహంగా వేడుక జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కేక్ తినిపించారు.