సహాకార సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: సహాకార సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో పొలింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 31న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 4 తేదిన రెండో దశ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 104 సహాకార సంఘాల్లో 55 సంఘాలకు మొదటి విడతగా, 49 సంఘాలకు రెండో విడతగా ఎన్నికలు జరుగుతాయి.