సహాయక పరికరాల శిబిరంలో హాజరైన దివ్యాంగులు

జహీరాబాద్ :జహీరాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ఉపకరణాలు సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాం లో జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఝరాసంగం న్యాలకల్,కోహిర్, మొగుడం పల్లి, మునిపల్లి మండలం లోని దివ్యాంగులు హాజరై పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా మహిళ శిశు దివ్యాంగ వయో వృద్దుల శాఖ అలింకో సౌజన్యం తో ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు..అర్హులైన దివ్యాంగులను గుర్తించేందుకు జహీరాబాద్ లోని ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో శిబిరాన్ని డిడబ్లుఓ పద్మావతీ, సీడీపీఓ సునితబాయ్,ఎంపీడీఓ సుమతి లు సందర్శించారు. పరికరాల శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఝరాసంగం మండల సూపర్ వైజర్ సునీత అంజమ్మ,,జ్యోతి,అలింకో సంస్థ సూపర్ వైజర్, జె. చంద్ర, శ్రీనివాస్, టివీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.