సాంకేతిక పరిజ్ఞానం ఉపమోగంలో ముందువరసలో రాష్ట్రం: సీఎం
హైదరాబాద్ :సాంకేతికపరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరసలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుయార్ రెడ్డి పేర్కోన్నారు. మీ సేవ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గుతోందని అయన అన్నారు. ఈ ఇండియా మీ సేవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న అయన సామాన్యుడికి విలువైన సులభతర సేవలను అందించడమే మీ సేవ లక్ష్యమని పేర్కోన్నారు. మీ సేవ పరిధిలోని త్వరలో మరిన్ని సేవలు వస్తాయని అయన చెప్పారు.



