సాకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు చేరువగా : మనోహర్‌

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వకార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరువయ్యే అవకాశం ఉందని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో క్లబ్‌ వెబ్‌సైట్‌ని అవిష్కరించారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ అని, విమర్శలను ప్రజాస్వామ్యం సాగతిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్‌ ఈ సందర్భంగా అన్నారు.