సాక్షి జర్నలిస్ట్ కిషోర్ కుమార్ మరణం ప్రజలకు తీరని లోటు
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 28 (జనం సాక్షి):-
సాక్షి జర్నలిస్ట్ కిషోర్ కుమార్ మరణం ప్రజలకు తీరని లోటు అని ముంజల బిక్షపతి అన్నారు ఈరోజు కిషోర్ దశదిన కర్మ సందర్భంగా కిషోర చిత్రపటానికి పూలమాలలు వేసి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కిషోర్ సార్ గారు నేను పి డి ఎస్ యు లో పనిచేస్తున్న సందర్భంలోనే పరిచయము గల జర్నలిస్టు కిషోర్ సార్ అని బిక్షపతి అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి రథసారధిగా ప్రజా సమస్యల పైన నిస్వార్ధంగా నీతి నిజాయితీగా వార్తలు రాసే మహోన్నతమైన వ్యక్తి కిషోర్ అని బిక్షపతి ఈరోజు గోవిందరావుపేట లో జరిగిన సంతాప దినం సందర్భంగా ఆయన అన్నారు నిర్భయంగా ఎవరికి భయపడకుండా వార్తలు రాసే వ్యక్తి కిషోర్ అని ఆయన అన్నారు నేను జిల్లా ఉద్యమంలో కన్నా ముందే కిషోర్ సార్ నాకు 20 సంవత్సరాల క్రితం పరిచయం అని బిక్షపతి అన్నారు ఇప్పుడు ఉన్న గోవిందరావుపేట సీనియర్ జర్నలిస్టు కూడా యుగంధర సునీల్ యోగ వినయ్ఎంతోమంది సీనియర్ జర్నలిస్టు లు నేను వామపక్ష పి డీ ఎస్ యు లో చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలోనే నాకు గోవిందరావుపేట జర్నలిస్టులకు సంబంధాలు ఉండేవి అందుకే కిషోర్ సార్ మరణం ప్రజలకు తీరని లోటు అని బిక్షపతి గారు అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాలడుగు వెంకట కృష్ణ బిసి జిల్లా నాయకుడు జంపాల చంద్రశేఖర్ ముసలయ్య ప్రచార కార్యదర్శి గుండె మీద వెంకటేశ్వర్లు తదితరులు కిషోర్ సార్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.