సాగర్‌ వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: విపక్షాల డిమాండ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):

సాగర్‌ నీటి వివాదంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ఇరు రాస్ట్రాల ప్రభుత్వ అలసత్వమని పేర్కొన్నాయి. అలాగే ఈ విసయంలో కేంద్రం జోక్యం చేసుకోని శాశ్వత పరిష్కారం చూపాలని అన్నాయి. కేంద్రం చోదయం చూడడం తగదని నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీఅలో విపక్ష నేత  జానారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్‌ నీటి వివాదంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది ఇరు రాష్టాల్ర ప్రజల మధ్య వివాదాలు చోటు చేసుకోవడం మంచిది కాదన్నారు. శనివారం  సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ పోలీసలుఉ ఘర్షణపడే వరకు సమస్య వెళ్లడం దారుణమని అన్నారు.  సమస్యను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఏపీ దౌర్జన్యం సరికాదన్నారు.  సాగర్‌ వద్ద జరిగిన పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇకముందు వివదాలు తలెత్తకుండా  నాగార్జున సాగర్‌ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ  జానారెడ్డి డిమాండ్‌ చేశారు. సాగర్‌ జలాల అంశం వివాదం కావడానికి కేంద్రం పట్టించుకోకపోవడమే కారణమన్నారు.విభజన చట్టంలో ఉన్న మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ‘సమస్య తీవ్రమవుతున్నా.. కేంద్రం చోద్యం చూసిందే తప్ప.. చేసిందేవిూ లేదు.  నీటి జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కంటితుడుపు చర్యలు కాకుండా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలి. సమస్యను విూరే పరిష్కరించుకోండని కేంద్రం అనడం బాధ్యతారాహిత్యం కాదా ? అని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. లేకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ వాటా దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని జానారెడ్డి అన్నారు.

ఘర్షణలు జరిగితే గానీ గుర్తించరా..?

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద ఇరు రాష్ట్ర పోలీసుల మధ్య ఘర్షణకు సీఎంలు చంద్రబాబు, కేసీఆరే కారణమని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో  ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్‌ వద్ద పోలీసుల మధ్య గొడవ జరిగితేనే కానీ… ఇద్దరు సీఎంలు చర్చలు జరిపేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 లక్షల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయన్నారు. రైతులు ప్రయోజనాలు తాకట్టు పెడుతూ సెంటిమెంట్‌తో ఇద్దరు సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పంటలు ఎండిపోతే విూదే బాధ్యత అని ఇద్దరు సీఎంలదే బాధ్యత అని ఈ సందర్బంగా హెచ్చరించారు. కృష్ణా రివర్‌ బోర్డుకు అధికారం ఇచ్చి… ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని గుత్తా సుఖేందర్రెడ్డి.. కేంద్రానికి సూచించారు.

తాత్సారం పనికిరాదు : కిషన్‌ రెడ్డి

జలవివాదాల విసయంలో తాత్సారం వల్లనే సమస్య తీవ్రంగా మారిందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి అన్నారు.  ఇదిలావుంటే ఇప్పటికే ఆలస్యం చేయడం వల్ల సాగర్‌ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయన్నార.

ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన విూడియాతో మాట్లాడుతూ  సాగర్‌ జలాల విషయంలో ఇరు రాష్టాల్ర అధికారులు ఘర్షణకు దిగడం దురదృష్టకరమన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని కిషన్‌ రెడ్డి చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రయోజనాలు దెబ్బతినకుండా నీటి వాటాలను వినియోగించుకోవాలన్నారు.

ఇరు రాష్టాల్ర సిఎంలదే తప్పు : మైసూరా

తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రులిద్దరూ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పుతో గెలిచిన సీఎంలు నామినేటెడ్‌ గవర్నర్‌ వద్దకు వెళ్లడం సరికాదన్నారు. సాగర్‌ జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు  ముందే మాట్లాడుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు అని మైసూరా విమర్శించారు. దీనికి ఇరు రాష్టాల్రపాలకులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటన తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని, ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన నెలకొందని  మైసూరా అన్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు మానుకుని చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలని మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు.