సాగర్ జలవివాదంపై మంత్రి హరీశ్ సమీక్ష

హైదరాబాద్: నాగార్జునసాగర్ జలవివాదంపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ శాఖ ఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ జవహార్ కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే 44 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ అదనంగా వాడుకుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏపీ అదనంగా నీరు వాడటంవల్లే సాగర్ నీటిమట్టం తగ్గిందన్నారు.