సాగర హారం సదర్భగా నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేయాలి: ఐకాస

హైదరాబాద్‌: సాగర హరాం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేందుకు ఉద్యోగులు వాలంటీర్లుగా పనిచేస్తే సుప్రీం ఆదేశాలననుసరించి తమపై కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. శాంతియుత కవాతును పోలీసులే భాష్పవాయువుతో చెడగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఉద్యోగులందరికీ ప్రభుత్వం మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పదిరోజుల్లో విచారణ జరిపి కేసులు ఎత్తివేయాలని లేకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు,