సాధారణ స్థితికి చేరుకున్నా వర్షాభావం

హైదరాబాద్‌: వర్షాభావంతో ఎదుర్కొంటున్న చాలా మండలాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని. 90 శాతం వరకు నాట్లు పడ్డాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఉన్నతాధికార్లతో వర్షపరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 150 చెరువులకు గండ్లు పడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 9, 10 తేదీలలో మరో మారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల 4గురు మృతిచెందారని, 150 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నయని రఘువీరారెడ్డి చెప్పారు.