సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా నమోదు చేసిన విజయాలను చూసే ఆమెను ఎంపిక చేశామని అఖిలభారత టెన్నిస్‌ అసొసియేషన్‌ వివరణ ఇచ్చింది.గ్రాండ్‌ స్లామ్‌ విజేతలైన విజేతలైన సానియా మహేశ్‌ భూపతి జంటను కాకుండా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియాతో ఆడడానికి లియాండర్‌పేన్‌ను ఎంపిక చేయడం ఐటా తన నిర్ణయాన్ని మరోమారు సమర్థించుకుంది.