సామాన్యలపై పెను భారం

తొర్రూరు, మే25(జనం సాక్షి) :తకేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను ఇప్పట్టికే 12 సార్లు పెంచి సామాన్యులపై పెను భారం మోపుతుందని వైఎస్సార్‌ సీపీ నాయకులు నాల్లం శ్రీనివాస్‌ ఆరోపించారు. వైఎస్సార్‌ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం ఆయన ఆయశాలను తుంగలో తొక్కి ప్రజల శ్రేయస్సును విస్మరించిందన్నారు. ముడిచమురు, రూపాయి పతనం వంటి విషయాలను సాకుగా చూపుతూ లీటరుకు రూ.7.50 పెంచిందని వెంటనే ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రు, ఉపేందర్‌, సోమేశ్వరా చారీ, కె.రాజ్‌ కుమార్‌, వెంకన్న, ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.