సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:సింగరేణ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది.ఈ ఎన్నికల్లో కరీంనగర్‌,అదిలాబాద్‌,వరంగల్‌ ఖమ్మం జిలాల్లోని 63,429 కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.కరీంనగర్‌ జిల్లా రామగుండం రీజియన్‌ పరిధిలోని 21,142 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.అక్కడి 9 భూగర్బ గనులతో పాటు వివిధ విభాగాల్లో 28 పోలింగ్‌ కేంద్రాలను ఏరాటు చేశారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.