సింగరేణి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం. రామారావు తెలిపారు. ఇంగ్లీషు మీడియంనందు 100శాతం, తెలుగుమీడియం నందు 97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా సింగరేణి పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం హర్షనీయమని వివరించారు. కార్మికులు వారి పిల్లలను అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్‌ పాఠశాలలకంటే అత్యున్నత విద్యాభోధనను అందిస్తున్న సింగరేణి పాఠశాలలో చేర్పించాలని కోరారు.