సింహాచలం దేవస్థానం వద్ద చిరుత మృతదేహం

విశాఖ, (మార్చి26) : సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సంఘటన జరిగింది. సింహాచలం దేవస్థానం  గజపతిసత్రం వెనుక భాగంలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. దీంతో, ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు, క్రూర జంతువులు  సంచరిస్తున్నాయనే ఆందోళన భక్తులు,  స్థానికుల్లో వ్యక్తమవుతోంది.