సింహాద్రి ఎన్టీపీసీలో ఆగ్నిప్రమాదం

విశాఖ : సింహాద్రి ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కన్వేయర్‌ బెల్ట్‌కు వ్యాపించాయి. దీంతో ఈ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.