సిఓఈ విద్యార్థుల హంగామా అదుర్స్.
అట్టహాసంగా ఫ్రెషర్స్ డే.
పోటో: డాన్స్ చేస్తున్న విద్యార్థులు.
బెల్లంపల్లి,సెప్టెంబర్22,(జనంసాక్షి)
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెస్నీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్ధులు పాటలు, నృత్యాలతో చేసిన హంగామా అదిరింది. బుదవారం రాత్రి గురుకులంలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జూనియర్లకు మరియు 5వతరగతి విద్ద్యార్ధులకు సీనియర్ విధ్యార్ధులు మేళతాలాలతో ఘనంగా పలికిన స్వాగత నృత్యాలు అలరించాయి.
కార్యక్రమానికి ముఖ్య అథిధిగా హాజరైన బెల్లంపల్లి మండల విధ్యాశాఖాధికారి పి మహేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సైదులుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి,మహనీయుల చిత్రపటాలకు పూలమాలలువేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు సాధిస్తున్న విజయాల వెనుక అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు నిస్వార్ధపూరితంగా పూర్తిస్థాయిలో సహకరిస్తున్న తల్లిడండ్రులేనని తాను భావిస్తున్ననన్నారు. విధ్యార్ధులు అందరూ సీనియర్, జూనియర్ అనే తారతమ్యం లేకుండా స్నేహభావంతో కలసి మెలసి చదువుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు బాగా తోడ్పడతాయన్నారు.
అదేవిధంగా విశిష్ట అథిధులుగా హాజరైన ప్రిన్సిపాల్స్ ఎస్ స్వరూప, ఊటూరి సంతోష్, వాణి, నిరూషా విధ్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం టాపర్స్ కు నాగినేని నాగిని, మరియు రవివర్మ మెమోరియల్ అవార్డ్స్ ను ఇంటర్ మొదటి సంవత్సరంలో కళాశాల టాపర్స్ గా నిలిచిన బత్తుల కారీక్ మరియు దుర్గం వెంకటేష్ లకు ముఖ్య అథిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు దాగం మహేష్, సభ్యులు సేని వెంకన్న సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్స్ యస్ స్వరూప, ఊటూరి సంతోష్, కస్తూరిబా యస్ ఓ వాణి, బిసి గురుకుల ప్రిన్సిపాల్ నిరోషా, వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి దాసం అజిత, ఉపాధ్యాయులు వరమణి ప్రమోద్ కుమార్, కొక్కుల రాజేశ్వర్, షిండే దత్త ప్రసాద్, శ్రీనివాస్ పొన్నం, శ్యాంసుందర్ రాజు, భోగ అశోక్, అధ్యాపకులు నాగినేని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, ఆకినేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మీనారాయణ,కట్ల రవీందర్, అనుముల అనిరుద్,విధ్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.