సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న వీఎస్‌ సంపత్‌

న్యూఢీల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వీఎస్‌ సంపత్‌ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.సీఈసీగా ఎస్‌వై ఖురేషీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంపత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం సీనియర్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంపత్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కొత్త సీఈసీగా నియమించిన విషయం తెలిసిందే.సంపత్‌ 2015 జనవరి వరకు సీఈసీగా కొనసాగుతారు.