సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
జనం సాక్షి, మంథని: మంథని మండలం దుబ్బపల్లి, గుంజపడుగు గ్రామాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్ పంపిణీ చేశారు. దుబ్బపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు రూ.60 వేలు, గుంజపడుగు గ్రామానికి చెందిన నూనే సతీష్‌కు రూ. 52 వేల విలువ చేసే చెక్కులు మంజూరీ కాగా బీఆర్‌ఎస పార్టీ నియోకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ ఆదేశాల మేరకు వారి ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందజేశారు. అదే విధంగా దుబ్బపల్లి, గుంజపడుగు గ్రామాల్లో ఉపాధి హమీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించి రోడ్లు త్వరిత గతిన పూర్తి చేసిన సర్పంచ్‌లను ఆయన అభినందించారు. అలాగే నిదుల మంజూరీకి కృషి చేసిన జెడ్పీ చైర్మన్‌కు ఆయా గ్రామాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ కుంట రాజు, ఎంపీటీసీలు గుమ్మడి సత్యవతి రాజయ్య, ఊదరి లక్ష్మిలచ్చన్న, మండల పార్టీ కార్యదర్శి అక్కపాక సంపత్ , గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు కండె రమేష్, వేణు, శంకర్‌గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.