సీఎంకు ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి):

అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్ళను న్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం నుంచి ఆయన బుధవారం నాడు పిలుపు అందింది. దీంతో ఆయన రేపు ఉదయం 6గంటలకు ఢిల్లీ బయ లుదేరతారని సమాచారంఇంత ఆకస్మి కంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి ముఖ్యమంత్రికి ఎందుకు పిలుపు వచ్చిందీ స్పష్టంగా తెలియరాలేదు. అయితే ధర్మాన రాజీనామా వ్యవహారం, తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ మంత్రులలో నెలకొన్న అభద్రతాభావం తదితర అంశాల గురించి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడానికే పారీఅధిష్ఠానం ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపిస్తున్నదని భావిస్తున్నారు. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ధర్మాన వ్యవహారంలో అధిష్ఠానం జోక్యం చేసుకోదని అధిష్ఠానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ మాటను వాయలార్‌ రవే చెప్పేశారు. సిబిఐ దర్యాప్తు విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోరని కూడా ఆయన స్పష్టం చేసేశారు. ఇకపోతే గవర్నర్‌ కూడా ధర్మానరాజీనామా విషయంలో ముఖ్యమంత్రి దగ్గరనుంచి సిఫార్సు ఏది వస్తే అదే చేస్తానని మంగళవారం కూడా స్పష్టం చేసేశారు. ఇకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదురవుతుందేమోననుకున్న రాష్ట్రమంత్రులు ఇప్పటికే తమ గురించి ఢిల్లీ అధిష్ఠానంతో మాట్లాడమని మంగళవారమే ముఖ్యమంత్రిని మంత్రులు కోరారు. ఆనాటి వివాదాస్పద నిర్ణయాలతో లబ్ధి పొందిన జగన్‌ రాజకీయంగా కూడా మరింత లాభపడుతుంటే ఏ లబ్దీ లేని తమకు ఈ శిక్ష ఏమిటని మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర ఆవేదన చెందారు. ఈ పరిస్థితులలో ఏమీ చేయడానికీ పాలుపోని ముఖ్యమంత్రి తనను కలిసిన మంత్రులకు మంగళవారంగాని, బుధవారంగాని ఏ మాటా చెప్పలేకపోయారు. పోనీ మేమే వెళ్లి అధిష్టానానికి అసలు ఏం జరిగిందీ వివరిస్తామని ముఖ్యమంత్రిని కోరారు. ఈలోగా ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందికరంగా పరిణమించిన అంశాలపై కొన్ని మార్గదర్శకాలను అధిష్ఠానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది.