సీఎంతో ముగిసిన హోంమంత్రి డీజీపీ భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల భేటీ ముగిసంది. తెలంగాణ కవాతు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన ఘటనలపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతనలు కాపాడేందుకు ఏ పరిస్థితుల్లో పోలీసులు లాఠీఛర్జి చేయాల్సి వచ్చిందో డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యమకారులు నిర్థేశించిన మార్గాల్లో కాకుండా వేరు దారుల్లో రావడంతో అడ్డుకోవాల్సి వచ్చిందని డీజీపీ పేర్కొనట్లు సమాచారం.