సీఎంను కలిసిన ఆయుష్‌ వైద్యులు

హైదరాబాద్‌: ఆయుష్‌ వైద్యుల సంక్షేమ సంఘల ప్రతినిధులు ఈ రోజు సీఎంను ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. పెండింగులో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, తమ శాఖకు నిధులు పెంచాలని , వైద్యుల వేతనాలు పెంచాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.