సీఎం కార్యాలయం వద్ద ప్రతినిధుల వైఖరిని ఖండించిన మంత్రి మురళి

హైదరాబాద్‌: సచివాలయంలో సీఎం కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న తెదేపా ప్రజాప్రతినిధుల వైఖరిని మంత్రి కొండ్రు మురళి ఖండించారు. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మరో రెండు వారాల్లో 800 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని మంత్రి కొండ్రు మురళి తెలిపారు.