సీఎం కేసీఆర్‌ను కలిసిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. చేనేత పరిశ్రమ, డ్రైఫోర్టుల అభివృద్ధి, మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అరుదైన కళాకారులకు అండగా ఉండాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. వస్త్ర ఉత్పత్తుల ఎగుమతికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రంలోనూ డ్రైఫోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.