సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మాహారాజుల్లా బ్రతుకుతున్నారు — ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ):– జనం సాక్షి:-
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బ్రతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు భీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని , కాంగ్రెస్ హయాం లో ఎరువుల కోసం తెలంగాణ లో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా చెప్పుల లైన్లు దర్శనమిచ్చెయ్ అని రోజుల తరబడి లైన్లలో నిల్చున్నా రైతులకు ఎరువులు దొరికేయి కావని సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే కేంద్రాన్ని నిలదీసి తెలంగాణా వచ్చే ఎరువుల వాటాను పెంచి సకాలంలో రైతులకు ఎరువులను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని తెలంగాణ ప్రభుత్వం రైతులను ఈవిధంగా అక్కన చేర్చుకొని వారిని మహారాజుల్లా చేస్తుంటే. రైతుల గురించి , రైతాంగ సమస్యలమీద వ్యవసాయ రంగం పై ఏమాత్రం అవగాహన లేని రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే విద్యుత్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ఈరోజు వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామం రైతు వేదిక క్లస్టర్ హాల్ లో నిర్వహించిన రైతుల ప్రత్యేక సమావేశం లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని లేకుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనిచ్చే ప్రసక్తి లేదని రైతులు సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కొలుపుల అమరేందర్ ,సాగర్ రెడ్డి, సంజీవరెడ్డి ,ఉమ, మమత నరేందర్ రెడ్డి, ఎంపిటిసిలు సర్పంచులు మద్దెల మంజుల నాగరాజ్ ,వార్డ్ మెంబర్ రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.