సీఎం క్యాంప్‌ ఆఫిస్‌ను ముట్టడించిన టిఆర్‌ఎస్‌వీ

హైదరాబాద్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు సీఎం క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో పోలీసులకు విద్యార్థులకు మద్యతోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌ తరలించారు.