*సీఎం దత్తత గ్రామం వాసాలమార్రి లో ఉచిత పశువైద్య శిభిరం*

ఫోటో రైట్  అప్01 తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న మోతే పిచ్చిరెడ్డి
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి  గ్రామంలో పశుగణభివృద్ధి సంస్థ ఉమ్మడి నల్లగొండ జిల్లా వారి ఆధ్వర్యంలో *ఉచిత పశువైద్య శిబిరం మరియు పాడి రైతుల అవగాహన సమావేశంలో* పాల్గొన్న *ఉమ్మడి నల్గొండ జిల్లా డి ఎల్ డి ఎ చేర్మెన్ మోతే పిచ్చిరెడ్డి*,  మాట్లాడుతూ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా మేలు జాతి ఆడ దూడలు జన్మించే విధంగా  వీర్య నాలికలను విడదీసిన వీర్యాన్ని ఎదకు వచ్చిన పశువుకు సరి అయిన సమయంలో కృత్రిమ గర్భాధారణ చేసి మేలు జాతి ఆడదుడని జన్మించే విధంగా చర్యలు చేపడుతున్నామని త్వరలో రైతులకు అందుబాటులో ఉంచుతామని రైతులు వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని ఈ విధానాన్ని రైతులు సద్వినియం చేసుకోని  పశు గణాభివృద్ధి ద్వారా 675 రూపాయలు విలువగల వీర్యాన్ని రైతులకు 250 రూపాయలకే సబ్సిడీతో అందిస్తామని మరియు మొదటిసారి కృత్రిమ గర్భాధారణతో చుడి నిల్వకపోయినా రెండవసారి కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే వారికి మొదటిసారి 250 రూపాయలు తిరిగి ఇవ్వబడును కావున రైతు సోదరులు వినియోగించుకుని జిల్లాలో ఈ మండలాన్ని పశు సంపదను అగ్రగామిగా నిలిచే విధంగా పశుగణాభివృద్ధి  సంస్థ ద్వారా సేవలందిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ ,మదర్ డైరీ పాల సంఘం చైర్మెన్ పలుగుల మల్లేష్ , మండల వెటర్నరీ డాక్టర్లు  శ్రీనివాస్ రావు ,చంద్ర రెడ్డి, ఉపసర్పంచ్ పలుగుల మధు మండలంలోని  వివిధ గ్రామాల పాలసంఘం చైర్మెన్ లు సూపర్ వైజర్ లు గోపాలమిత్రలు, మైత్రి , రైతులు  తదితరులు  పాల్గొన్నారు.