సీఎం వ్యాఖ్యలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విలీన దినోత్సవంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి తాను హైదరాబాదీ అని చెప్పుకొనే సమైక్యవాది అని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజమైన హైదరాబాదీ అయితే పక్క రాష్ట్రాలు బావిలో దూకితే మనమూ దూకాలా అని వ్యాఖ్యానించి ఉండేవారా అని ప్రశ్నించారు. ప్రపంచ చరిత్రలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోని జాతి తెలంగాణదే అని ఆవేదన వ్యక్తం చేశారు.