సీఎం సహాయ నిధి అభయ హస్తం-మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్య పేదలకు అభయ హస్తంగా సీఎం సహాయనిధి నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పోచయ్యకు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రి నుంచి లక్ష 25 వేల రూపాయల ఎల్.ఓ.సి లెటర్ ను హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో శనివారం నాడు అతని కుటుంబ సభ్యులకు మంత్రి అంద చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్య చికిత్సలు చేయుంచుకోలేని అనేక మందికి సీఎం సహాయనిధి కింద ఎల్.ఓ.సి ద్వారా ముందస్తుగా చెక్కులను అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయానికి తాము ఎప్పుడు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.