సీఏ పరీక్షా విధానంలో మార్పులు

హైదరాబాద్‌: సీఏ పరీక్షా విధానంలో మార్పులు చేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అద్యక్షుడు జయదీవ్‌ నరేంద్ర షా చెప్పారు. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ స్టూడెంట్‌స అసోసియేషన్‌ జాతీయ స్థాయి సమావేశాన్ని  ప్రారంబించిన అయన సీఏ ఔత్సాహిక అభ్యర్థుళకు పలు సూచనలు చేశారు. సీఏ అభ్యర్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించేందుకే మూడు గంటల పరీక్ష సమయానికి 15 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తున్నట్లు పరీక్ష వేళల్లో మార్పులు తీసుకువచ్చినట్లు అయన తెలిపారు. దేశంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల కొరత ఉన్నప్పటికీ ప్రమాణాల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని నరేంద్ర షా స్పష్టం చేశారు.