సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన అవసరం*

…డాక్టర్ అమరవాది రవీంద్రమోహన్
ఎల్ బి నగర్, సెప్టెంబర్11, (జనంసాక్షి:) కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులవల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎల్ బి నగర్ మహల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ రవింద్రమోహన్ సలహాలు, సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ వాతావరణంలో మార్పులు రావడం దోమలు బాగా పెరగడం సూర్యరశ్మి తగుమోతాదులో లభించకపోవడం వర్షపు నీరు కలుషితమవ్వడం వంటి కారణాల వల్ల సాదారణంగా జలుబు, తలనొప్పి, ముక్కుదిబ్బడ, కొందరిలో ఒళ్ళునొప్పులు,  అలసట, జ్వరం వంటి లక్షణాలు వైరల్ ఫీవర్స్ కనిపిస్తుంటాయి అశ్రద్ద చేయకుండా వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స చేయించుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మేలు. జలుబు చేసిన రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిని మూతికి, ముక్కుకి చేతి రుమాలు కవర్ చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో మనుషుల మధ్యనే చీదడం, ఉమ్మివేయడం చేయకూడదు. వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరల్ ఫీవర్స్ కి దోమలు ప్రధానంగా కారణం అవుతున్నాయి. గొంతునొప్పి వంటి సమస్యల ఉపషమనం కోసం కాచి వడబోసి చల్లార్చిన నీటిని త్రాగితే మంచిది, చల్లని నీరు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంస్ కి దూరంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ స్వీయ నియంత్రణతో సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ది ఎక్సిలెన్స్ ఆఫ్ హ్యూమానిటి అవార్డ్ గ్రహీత డాక్టర్ ఎ రవీంద్రమోహన్ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కోసం సలహాలు సూచనలు తెలియజేశారు.