సీతక్కకు తప్పిన ప్రమాదం

వెంకటాపురం: వరంగల్‌ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొనింది. ప్రమాదంనుంచి సీతక్క సురక్షితంగా బయటపడ్డారు. గోవిందరావుపేట మండంలోని గుళ్లవాగుప్రాజెక్టును సందర్శించి ఆమె ములుగుకు వస్తుండగా లింగాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని సమాచారమందింది.