సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్డిగా దుర్గాప్రసాద్‌రావు బాధ్యతలుస్వీకణర

హైదరాబాద్‌:సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్‌ జడిగా యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం స్వీకరించారు.సీబీఐ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక జడ్జి టి.పట్టాభిరామారావు ముడువులు పొంది ఓఎంసీ కేసులో నిందితుడైన గాలి జనార్దన్‌ రెడ్డికి బెయిలు మంజూరు చేశారన్న అభియోగం పై సస్పెనట్ట్షిన్‌కు గురైన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో సీబీఐ కేసుల విచారణ నిమిత్తం కొత్తగా ఏర్పాటైన కోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది.దినిలో భాగంగా సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ జడ్డిగా దుర్గాప్రసాద్‌రావు బుధవారం బాధ్యతలు చేపట్టి కేసుల విచారణ ప్రారంభించారు.ఇక్కడ ప్రిన్సిపల్‌ జడ్డిగా ఉన్న ఎ.పుల్లయ్య మొదటి అదనపు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్డిగా బదిలీ అయ్యారు.